తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం బోనాల పండుగ: వంటేరు ప్రతా్‌పరెడ్డి
ABN , First Publish Date - 2022-07-26T05:17:20+05:30 IST
తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయం బోనాల పండుగని, ప్రజలంతా బోనాల పండుగను సంతోషంగా జరుపుకుంటాని టీఎ్‌సఎ్‌ఫడీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.
వర్గల్, జూలై 25: తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయం బోనాల పండుగని, ప్రజలంతా బోనాల పండుగను సంతోషంగా జరుపుకుంటాని టీఎ్‌సఎ్‌ఫడీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. సోమవారం వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో జరిగిన బోనాల ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతారమే్‌షగౌడ్, సర్పంచ్ అప్పిడి సునీతారమణారెడ్డి, ఉపసర్పంచ్ కనకరాజు పాల్గొన్నారు.
కస్తూర్భాలో ఘనంగా బోనాలు
మద్దూరు, జూలై 25: మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఆషాఢమాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు పోతరాజు వేషధారణతో పాటు అమ్మవారికి బోనం తయారీతో అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.