‘ఆహా’సుపత్రి

ABN , First Publish Date - 2022-12-12T00:09:33+05:30 IST

సాధారణంగా చికిత్స కోసం రోగి సర్కారు ఆసుపత్రికి వస్తే సూదులు, సెలైన్లు, సిరింజీలు, కాటన్‌, రక్తం, కుట్లు, కనిపిస్తాయి. కానీ సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రోగి వస్తే వచ్చిన రోగం మర్చిపోవాల్సిందే. ఇక్కడి ఆస్పత్రి గోడలపై వేసిన పెయింటింగ్‌ అందాలు మైమరిచిపోయేలా ఉన్నాయి.

‘ఆహా’సుపత్రి
సంగారెడ్డి జీజీహెచ్‌లో ఆకట్టుకుంటున్న వాల్‌ పెయింటింగ్‌లు

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 11 : సాధారణంగా చికిత్స కోసం రోగి సర్కారు ఆసుపత్రికి వస్తే సూదులు, సెలైన్లు, సిరింజీలు, కాటన్‌, రక్తం, కుట్లు, కనిపిస్తాయి. కానీ సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రోగి వస్తే వచ్చిన రోగం మర్చిపోవాల్సిందే. ఇక్కడి ఆస్పత్రి గోడలపై వేసిన పెయింటింగ్‌ అందాలు మైమరిచిపోయేలా ఉన్నాయి. కార్పొరేట్‌ స్థాయిలో దర్శనమిచ్చేలా ఆసుపత్రి గోడలపై వివిధ ఆకృతులను పెయింటింగ్‌ రూపంలో వేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.66 కోట్ల నిధులతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆధునీకరణ పనులను చేపట్టారు. దీంతో ఆస్పత్రి రూపురేఖలు మారిపోయాయి. ఆసుపత్రి అంతా కొత్తగా కనిపించేలా వార్డుల్లో మరమ్మతులతో పాటు అన్ని విభాగాల్లో వేసిన వివిధ రకాల పెయింటింగ్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - 2022-12-12T00:09:36+05:30 IST