అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-08T04:59:49+05:30 IST

అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ గ్రామానికి చెందిన సున్నం శ్రీకాంత్‌ (38) ట్రాక్టర్‌, హార్వెస్టర్‌ను ఫైనాన్స్‌ ద్వారా తీసుకున్నాడు.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 7: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ గ్రామానికి చెందిన సున్నం శ్రీకాంత్‌ (38) ట్రాక్టర్‌, హార్వెస్టర్‌ను ఫైనాన్స్‌ ద్వారా తీసుకున్నాడు. అయితే వాటికి సరైన పని లభించకపోవడంతో తెచ్చిన అప్పులు పేరుకుపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక సోమవారం సాయంత్రం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సజ్జనపు శ్రీధర్‌ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Read more