బైక్‌ ఢీకొని విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-03-06T04:55:52+05:30 IST

బైక్‌ ఢీకొని విద్యార్థి మృతిచెందిన ఘటన పెద్దశంకరంపేట శివారులో శనివారం జరిగింది.

బైక్‌ ఢీకొని విద్యార్థి మృతి

పెద్దశంకరంపేట, మార్చి 5: బైక్‌ ఢీకొని విద్యార్థి మృతిచెందిన ఘటన పెద్దశంకరంపేట శివారులో శనివారం జరిగింది. ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని టెంకటి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయికిరణ్‌(13) పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం సైకిల్‌పై స్కూలుకు వెళ్తుండగా కిందపడటంతో ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ అదుపు తప్పి సాయికిరణ్‌పై నుంచి దూసుకెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వాసుపత్రికి  తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. తండ్రి గతంలోనే మరణించాడు.  తల్లి లింగవ్వ కూలీ పని చేస్తూ కొడుకు, కూతురును పోషించుకుంటుండగా, కొడుకు మృతి చెందడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Read more