భైరి నరే్‌షపై కఠిన చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-12-31T23:01:25+05:30 IST
చేర్యాల, డిసెంబరు 31: అయ్యప్ప జననంతో పాటు హిందూదేవుళ్ల పట్ల అసభ్యకరంగా ప్రసంగించి అవమానపరిచిన భైరి నరేశ్, రెంజర్ల రాజేశ్‌ను అరె్‌స్టచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం చేర్యాలలో అయ్యప్ప మాలాధారణస్వాములు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు.
పలు మండలాల్లో అయ్యప్ప మాలాధారణస్వాముల ఆందోళన
చేర్యాల, డిసెంబరు 31: అయ్యప్ప జననంతో పాటు హిందూదేవుళ్ల పట్ల అసభ్యకరంగా ప్రసంగించి అవమానపరిచిన భైరి నరేశ్, రెంజర్ల రాజేశ్‌ను అరె్‌స్టచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం చేర్యాలలో అయ్యప్ప మాలాధారణస్వాములు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి చుంచనకోట క్రాస్‌రోడ్డు వరకు స్వామివారి నామస్మరణతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడి జగదీశ్వర్‌రావు, ఊట్లపల్లి శ్రీనివాస్, అయిత సంపత్, బద్దిపడిగ నర్సింహారెడ్డి, నర్ర మహేందర్‌రెడ్డి బుక్క సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శనివారం కొమురవెల్లిలో భైరి నరేశ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్, భజరంగ్‌దళ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్, రెంజర్ల రాజే్‌షపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని దౌల్తాబాద్ అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం దౌల్తాబాద్ ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
వర్గల్: అయప్పస్వామి జీవిత చరిత్రపై వరంగల్‌లో జరిగిన సమావేశంలో నాస్తిక సమాజం అధ్యక్షుడు ఓయూ నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై సీతారామాంజనేయ భజన మండలి బృందం, అయ్యప్ప దీక్ష సంఘం సభ్యులు, రేణుకాఎల్లమ్మ భజన మండలి సభ్యులు, హిందూ సంఘం నాయకులు, గ్రామస్థులు, అలాగే వర్గల్ గ్రామ అయప్ప దీక్ష బృందం సభ్యులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గౌరారం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మద్దూరు: అయ్యప్పస్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరే్‌షపై శనివారం మద్దూరు పోలీ్‌సస్టేషన్‌లో బీజేవైఎం జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
హుస్నాబాద్ టౌన్: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరే్‌షపై పీడీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అయ్యప్పస్వాములు ధర్నా నిర్వహించారు. అయ్యప్పస్వాములు వీవీ.రమణ, కుతాటి చిరంజీవి, రాజిరెడ్డి, గోపి, ఫార్వర్డ్ బ్లాక్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కొండపాక: హిందూ దేవతలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నరే్‌షపై పీడీయాక్టు నమోదు చేసి శిక్షించాలని హిందూ ధార్మిక సంస్థలు, అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో కుకునూరుపల్లిలో ర్యాలీ నిర్వహించి పోలీ్‌సస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. అలాగే దుద్దెడలో అయ్యప్ప సేవా సమితి, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, రాజీవ్ రహదారిపై నరేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు, సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్‌గౌడ్, ఉపాధ్యక్షులు గోనె రమేష్, ప్రధాన కార్యదర్శి చిలుముల వెంకటేశం, కోశాధికారి రామచంద్రారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
సిద్దిపేట కల్చరల్: బైరి నరే్‌షపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం అయ్యప్ప భక్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శరవేశ్వరాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్ వరకు సాగింది. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో నరే్‌షపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.