వర్గల్‌క్షేత్రంలోని వేంకటేశ్వరాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు
ABN , First Publish Date - 2022-01-06T05:45:20+05:30 IST
వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు.
వర్గల్, జనవరి 5 : వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేంకటేశ్వరస్వామివారికి ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య విశేష పంచామృతాభిషేకా లు నిర్వహించారు. పూజల అనంతరం స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు శ్రీరాంపండరి ఆధ్వర్యంలో లక్ష తులసి అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు వేద పాఠశాల విద్యార్థులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు క్షేత్రంలో విద్యాసరస్వతీ అమ్మవారి ఆలయంతో పాటు లక్ష్మీగణపతి, స్వయంభూ శంభులింగేశ్వరాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వేడుకల సందర్భంగా విద్యాధరి క్షేత్రం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.