సోయా పంట కోతకు కూలీల కొరత

ABN , First Publish Date - 2022-10-09T04:01:58+05:30 IST

సోయా పంట కోతకు వచ్చిన తరుణంలోనే వర్షం కురుస్తుండడంతో పాటు కూలీల కొరతతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

సోయా పంట కోతకు కూలీల కొరత

 ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్న రైతులు


కంగ్టి, అక్టోబరు 8: ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోతకు వచ్చిన సోయా పంటను రాసులు చేసుకునేందుకు కంగ్టి మండలంలోని రైతులను కూలీల కొరత వేదిస్తుంది. సోయా పంట కోతకు వచ్చిన తరుణంలోనే వర్షం కురుస్తుండడంతో పాటు కూలీల కొరతతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పొరుగున్న ఉన్న కర్ణాటకలోని నాగన్‌పల్లి, చింతాకి, కరంజి, రాయిపల్లి, సుందాల్‌, ఎన్‌గుందా గ్రామాల నుంచే కాకుండా కామారెడ్డి జిల్లాలోని వడ్లెం, కాస్లాబాద్‌, కారేగాం, గొద్మెగాం, కొడ్‌పగల్‌, ఖండేభల్లూర్‌, విఠల్‌వాడి గ్రామాల నుంచి రాపూపోనూ వాహన చార్జీలను భరిస్తూ కూలీలను తీసుకొస్తున్నారు. ఒక్క బస్తా సోయా విత్తనాల పంట కోసేందుకు రూ.3 వేల నుంచి రూ.3,200ల వరకు కూలీలకు చెల్లిస్తున్నారు. దీంతో ఒక్కో కూలీ రోజుకు రూ.5 వందల నుంచి రూ.6 వందల వరకు సంపాదిస్తున్నారు.


 

Updated Date - 2022-10-09T04:01:58+05:30 IST