ఉమ్మడి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపిక

ABN , First Publish Date - 2022-12-31T23:21:14+05:30 IST

టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెదక్‌లో శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి.

 ఉమ్మడి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపిక
ఎంపికైన క్రీడాకారులు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు31: టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెదక్‌లో శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి కంప్యూటర్‌ యుగంలో యువత మైదానంలో ఆడే ఆటలతోపాటు ఇండోర్‌ గేమ్స్‌ వైపు కూడా ఆసక్తి చూపాలన్నారు. పురుషుల విభాగంలో గబ్బుల అర్నీత్‌, రవితేజ, అనీష్‌, స్టాండ్‌ బాయ్స్‌గా కిషోర్‌, జూనియర్స్‌ విభాగంలో విశ్వేశ్వర్‌, శ్రీనివా్‌సచారి, సాయి ప్రణీత్‌, స్టాండ్‌బాయ్స్‌గా నరేష్‌ ఎంపికైనట్టు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణరాజ్‌, ప్రభు తెలిపారు. ఎంపికైనవారు జనవరి 4న హైదరాబాద్‌లో జరిగే అంతర్‌ జిల్లా పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని చెప్పారు. టీం కోచ్‌, మేనేజర్లుగా నరేష్‌, చందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:21:15+05:30 IST