సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత : సీపీ

ABN , First Publish Date - 2022-03-06T05:06:12+05:30 IST

సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత ఉంటుందని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు.

సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత : సీపీ
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శ్వేత

సిద్దిపేట క్రైం, మార్చి 5 : సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత ఉంటుందని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. శనివారం ఆమె కమిషనర్‌ కార్యాలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌, ఎన్వీఆర్‌, డీవీఆర్‌ తదితర అంశాల గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఉన్న కోఆర్డినేటర్లు పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించుకోవాలని, దానికి సంబంధించిన రిపోర్టు, బ్యాకప్‌ తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఎస్బీ ఏసీపీ రవీందర్‌రాజు, ఆర్‌ఎ్‌సఐ వెంకట్‌రమణ, ఐటీసెల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, సీసీ కెమెరాల జిల్లా కోఆర్డినేటర్లు ఏఎ్‌సఐ సంధాని, సిబ్బంది పాల్గొన్నారు.

Read more