అధిక సాంద్రత పత్తి సాగును పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2022-11-18T23:59:49+05:30 IST

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలియజేశారు.

అధిక సాంద్రత పత్తి సాగును పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఎడవల్లిలో పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

జగదేవ్‌పూర్‌, నవంబరు 18: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలియజేశారు. మర్కుక్‌, నరసన్నపేట, ఎర్రవల్లిలో ఈ పద్ధతి ద్వారా సాగు చేసే పొలాలను సందర్శించి పరిశీలించారు. పత్తి శాస్త్రవేత్త డా.తిరుమలరావు మాట్లాడుతూ ఈ పద్ధతిలోని వంగడాలు పంట కాలం తక్కువగా ఉండటం వల్ల తొందరగా పూత, కాయలు 20 నుంచి 30 వరకు వస్తున్నాయని వివరించారు. మొక్కలు ఏపుగా పెరగకుండా మేపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎకరాకు 25-30 కేజీల యూరియా 15 కిలోల పొటాష్‌ ఎరువులను వేసుకోవాలన్నారు. వారి వెంట డా.రాంప్రసాద్‌, ప్రశాంత్‌, మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్‌ రెడ్డి, రైతు గణేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-18T23:59:49+05:30 IST

Read more