ఆకునూరులో శాతవాహన నాణెలు లభ్యం

ABN , First Publish Date - 2022-07-06T05:08:02+05:30 IST

మండలంలోని ఆకునూరు గ్రామం లో శాతవాహనకాలం నాటి నాణె లు లభ్యమయ్యాయి.

ఆకునూరులో శాతవాహన నాణెలు లభ్యం
లభ్యమైన నాణెం, కుండపెంకు

చేర్యాల,  జూలై 5:  మండలంలోని ఆకునూరు గ్రామం లో శాతవాహనకాలం నాటి నాణెలు లభ్యమయ్యా యి. కొత్తతెలంగాణ చరిత్రబృందం యువసభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ మంగళవారం గ్రామంలోని పాటిగడ ్డమీద ప్రాంతంలో అన్వేషించి ఒక నాణెం, కొన్ని కుండ పెంకులను కనుగొన్నారు. నాణెం ఫోటీన్‌ లోహంతో చేయబడి నాణెనికి ఎడమవైపు తొండం ఎత్తి ఉన్న ఏనుగుబొమ్మ కలిగి ఉంది. నాణెనికి వెనకవైపు ఉజ్జయిని చిహ్నం ఉండటంతో శాతకర్ణి నాణెంగా గుర్తించారు. అలాగే గోటినొక్కులు, పూల డిజైన్లతో కుండపెంకులు లభించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పరిశోధన జరిపిస్తే మరిన్ని చరిత్ర విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. 

 

Updated Date - 2022-07-06T05:08:02+05:30 IST