సర్వమత సన్నిధి వట్‌పల్లి వెంకటఖ్వాజా దర్గా

ABN , First Publish Date - 2022-02-28T05:18:18+05:30 IST

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన వట్‌పల్లి వెంకటఖ్వాజా దర్గా ఉర్సు ఉత్సవాలను మార్చి 1నుంచి నిర్వహించనున్నారు.

సర్వమత సన్నిధి వట్‌పల్లి వెంకటఖ్వాజా దర్గా
వట్‌పల్లిలోని వెంకటఖ్వాజా దర్గా

మార్చి 1నుంచి దర్గా ఉర్సు ఉత్సవాలు

భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తుల హాజరు


వట్‌పల్లి, ఫిబ్రవరి27: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన వట్‌పల్లి వెంకటఖ్వాజా దర్గా ఉర్సు ఉత్సవాలను మార్చి 1నుంచి నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకలకు రాష్ట్రానికి చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఆశ్రమ నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు హాజరయ్యే భక్తుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. మార్చి 1న సమ, సందాల్‌, గంధఆరాధన, అభిషేకం, పుష్పార్చన, 2న ప్రసాద వితరణ, సమదీపారాధన, 3న సమాప్త ఆరాధన, పుష్పార్చన నిర్వహించనున్నారు. 


ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలి 

వట్‌పల్లి వెంకట ఖ్వాజా దర్గా 36వ ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని ‘వరం’ కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి అన్నారు. ఆదివారం వట్‌పల్లి దర్గా ఆవరణలో ట్రస్టు బాధ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్‌ సాంబిరెడ్డి, జోగిపేట సీఐ శ్రీనివా్‌స, ఎస్‌ఐ దశరథ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శేషగిరిరావు, ఫైర్‌ ఆఫీసర్‌, శ్రీశైలం, ఎలక్ట్రిసిటీ ఏఈ నారాయణ, వివిధ శాఖల అధికారులు, నాయకులు బుద్దిరెడ్డి,  బస్వరాజ్‌, శివాజీ రావు, నరసింహులు, అశోక్‌గౌడ్‌,మధు, రాజేంద్రరావు, ప్రకాశం పాల్గొన్నారు


Updated Date - 2022-02-28T05:18:18+05:30 IST