‘సంఘం శరణం గచ్ఛామి’

ABN , First Publish Date - 2022-12-13T00:12:59+05:30 IST

నారాయణరావుపేటలో సోమవారం అంబేడ్కర్‌ జీవిత చరిత్ర.. సంఘం శరణం గచ్ఛామి పేరిట నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు.

‘సంఘం శరణం గచ్ఛామి’
అంబేడ్కర్‌ జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు

అంబేడ్కర్‌ జీవిత చరిత్ర నృత్య రూప నాటక ప్రదర్శన

నారాయణరావుపేట, డిసెంబరు 12 : నారాయణరావుపేటలో సోమవారం అంబేడ్కర్‌ జీవిత చరిత్ర.. సంఘం శరణం గచ్ఛామి పేరిట నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. మనుస్మృతిని దహించటం, గాంధీ జీవితంలోని అంశాలలో విభేదాలు, తరతరాల వివక్ష కారణంగా బౌద్ధ మతాన్ని స్వీకరించడం వంటి పలు అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. జడ్పీటీసీ లక్ష్మీరాఘవరెడ్డి, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సర్పంచ్‌ ఆంజనేయులు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:13:00+05:30 IST