సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినశరత్‌

ABN , First Publish Date - 2022-06-18T04:54:36+05:30 IST

సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినశరత్‌
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న శరత్‌

సంగారెడ్డిటౌన్‌, జూన్‌ 17: సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శుక్రవారం ఉదయం 10గంటలకు ఆయన కలెక్టర్‌ ఛాంబర్‌లో బాఽధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గణే్‌షగడ్డ వద్ద ఉన్న వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ చేరుకున్న ఆయన తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, తదితరులు పూల మొక్కలు అందించి శరత్‌కు స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాఽధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తానన్నారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ సంగారెడ్డిని ఆదర్శ జిల్లాగా మారుస్తానన్నారు. తాను గతంలో ఇక్కడ జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన అనుభవంతో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, ఆసరా, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేస్తానన్నారు. 


కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

 జిల్లా కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఎ.శరత్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ రమణకుమార్‌, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, జిల్లా అధ్యక్షుడు సుశీల్‌ బాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాములు, పంచాయితీ రాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యకాంత్‌, ప్రధాన కార్యదర్శి వేణుమాధవ్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌తో పాటు ఆర్డీవోలు మెంచు నగేష్‌, అంబదా్‌సతో పాటు జిల్లా శాఖల అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు కలెక్టర్‌ శరత్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు


రుద్రారం గణేషుడిని దర్శించుకున్న కలెక్టర్‌, పూర్వ కలెక్టర్‌

 పటాన్‌చెరురూరల్‌: విధుల నుంచి బదిలీపై వెళ్తున్న పూర్వ కలెక్టర్‌ హన్మంతరావు కుటుంబసభ్యులతో రుద్రారం గణేషున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రస్తుత కలెక్టర్‌ శరత్‌ కుటుంబసభ్యులతో సహా గణేశ్‌ ఆలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా రుద్రారం గ్రామసర్పంచ్‌ సుధీర్‌రెడ్డి, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, ఆర్డీవో నగేష్‌, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్‌ తదితర ఆలయ కమిటీ సభ్యులు ఇరువురికి స్వాగతం పలికారు. గతంలో సంగారెడ్డి జేసీగా పనిచేసిన కాలంలో శరత్‌ పలుమార్లు గణేష్‌ ఆలయానికి వచ్చి  పూజలు నిర్వహించేవారు. ఈ నేపఽథ్యంలో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు రుద్రారం గణేషున్ని కుటుంబ సభ్యులతో సహా  దర్శించుకోవటం గమనార్హం.

Updated Date - 2022-06-18T04:54:36+05:30 IST