మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన

ABN , First Publish Date - 2022-10-08T04:24:05+05:30 IST

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన

  పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి


జిన్నారం, అక్టోబరు 7: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మాధారం పంచాయతీ పరిధిలో చాకలి ఐలమ్మ, ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ విగ్రహాల ఏర్పాటుకు నిర్వహించిన భూమిపూజలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌ తరాలకు మహనీయుల సేవలను తెలియజేసే లక్ష్యంతో సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, నియోజకవర్గంలో రాజకీయ, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామ స్వాగత తోరణ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచ్‌ సరితసురేందర్‌గౌడ్‌,  ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-10-08T04:24:05+05:30 IST