బందోబస్తు మధ్య షెడ్ల తొలగింపు

ABN , First Publish Date - 2022-06-12T04:25:42+05:30 IST

పట్టణంలోని రాజీవ్‌ చౌక్‌ ప్రాంతంలో శనివారం మున్సిపల్‌ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య పలు దుకాణాల షెడ్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగింప జేశారు.

బందోబస్తు మధ్య షెడ్ల తొలగింపు

అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులపై కేసు నమోదు

నారాయణఖేడ్‌, జూన్‌ 11: పట్టణంలోని రాజీవ్‌ చౌక్‌ ప్రాంతంలో శనివారం మున్సిపల్‌ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య పలు దుకాణాల షెడ్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగింప జేశారు. శనివారం దుకాణాల తొలగింపును టీపీసీసీ సభ్యుడు డాక్టర్‌ సంజీవరెడ్డి, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలంలోని షెడ్లను ఎలా తొలగిస్తారంటూ కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా జనాలు పెద్ద ఎత్తున పోగయ్యారు. దీంతో డీఎస్పీ శ్రీరాం, సీఐ రామక్రిష్ణరెడ్డి, ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, మొగులయ్య, లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో షెడ్ల తొలగింపునకు ఆటంకం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బంది షెడ్ల తొలగింపును కొనసాగించారు. కాగా షెడ్ల తొలగింపును అడ్డుకోవడమే కాకుండా మున్సిపల్‌ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, దారం శంకర్‌, తాహేర్‌, శ్రీనివా్‌స,  శంకర్‌ తదితరులపై కమిషనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు  ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వివరించారు. 

Updated Date - 2022-06-12T04:25:42+05:30 IST