అభివృద్ధి పనుల బిల్లులను విడుదల చేయండి
ABN , First Publish Date - 2022-12-16T23:51:49+05:30 IST
అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని, నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు.
వెల్దుర్తి, డిసెంబరు 16: ఎంపీపీ స్వరూప అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని, నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. త్వరలో బిల్లులు వచ్చేలా చూస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. గ్రామాల్లో రోడ్ల మరమ్మతుకు రూ.9.2 కోట్లు, మన ఊరు-మన బడి కార్యక్రమానికి రూ.6 కోట్లు మంజూరయినట్లు పీఆర్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. పశువుల తొట్ల బిల్లులను జనవరిలో మంజూరు చేయిస్తామని ఏపీఓ రాజు తెలిపారు. మహిళా సమాఖ్యలో అందరికీ సమాచారం ఇచ్చి మహిళా సంఘాలకు ఐకేపీ రుణాలు అందేలా చూడాలని జడ్పీటీసీ రమే్‌షగౌడ్ సూచించారు. వ్యవసాయ సాగుకు ఎన్ని గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారో తెలుపాలని విద్యుత్ అధికారులను వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్ సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. తహసీల్దార్ సురే్‌షకుమార్, సభ్యులు పాల్గొన్నారు.