విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , First Publish Date - 2022-12-15T00:06:50+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధ్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సర్దనలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ శేరి నారాయణరెడ్డి

హవేళిఘణపూర్‌, డిసెంబరు 14: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధ్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని సర్ధన ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను, మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలకు మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఎస్‌ఎంసీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అంశాలు నేర్పించాలన్నారు. అనంతరం హవేళిఘణపూర్‌లో తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఆయనవెంట వైస్‌ ఎంపీపీ రాధాకిషన్‌ యాదవ్‌, నాయకులు రాజేశ్వర్‌రావు ఉన్నారు.

మధ్యాహ్న భోజన బియ్యాన్ని స్కూల్‌ వరకు అందించాలి: టీపీటీఎఫ్‌

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 14: మధ్యాహ్న భోజన బియ్యాన్ని స్కూల్‌ వరకు అందించాలని టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం డీఈవో నాంపల్లి రాజేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌ మాట్లాడుతూ.. ప్రతీ నెల హెచ్‌ఎంలు ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల నుంచి తీసుకురావడం భారంగా మారిందన్నారు. ఒక రోజు పని దినాన్ని నష్టపోవాల్సి వస్తుందన్నారు. గతంలో మాదిరిగా పాఠశాలల వరకు బియాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్లు లక్ష్మయ్యయాదవ్‌, పటాన్‌చెరు మండలాధ్యక్షుడు రాములు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:06:51+05:30 IST