విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం

ABN , First Publish Date - 2022-07-06T05:25:22+05:30 IST

విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది.

విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధం

జగదేవ్‌పూర్‌, జూలై 5: విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామస్థులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొడుగు ప్రభాకర్‌ వ్యవసాయ పనుల నిమిత్తం రోజు మాదిరిగానే పొలం వద్దకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో విద్యుదాఘాతం ఏర్పడి గుడిసె దగ్ధమైంది. దీంతో ఇంట్లోని వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదు, అర తులం బంగారం, ఆరు క్వింటాళ్ల బియ్యం, భూమి పట్టాదారు పాస్‌బుక్కులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.

Read more