తొలిరోజు పల్స్ పోలియో విజయవంతం
ABN , First Publish Date - 2022-02-28T04:55:52+05:30 IST
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం తొలిరోజు విజయవంతమైనట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 0-5 సంవత్సరాలలోపు చిన్నారుల్లో తొలిరోజు 97.09 శాతం మందికి పోలియో చుక్కలు వేసినట్టు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 685 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో 288 హైరిస్క్ కేంద్రాలుగా గుర్తించారు. జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు 87,460 మంది పిల్లలను గుర్తించిన వైద్యశాఖ సిబ్బంది, పొలియో చుక్కలను వేసేందుకు 2,820 మంది సిబ్బంది, 69 మంది సూపర్‌వైజర్లను నియమించారు.
685 కేంద్రాల్లో 84,915 మందికి చుక్కల మందు
భాగస్వాములైన 2,889 మంది సిబ్బంది
సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 27: సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం తొలిరోజు విజయవంతమైనట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 0-5 సంవత్సరాలలోపు చిన్నారుల్లో తొలిరోజు 97.09 శాతం మందికి పోలియో చుక్కలు వేసినట్టు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 685 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో 288 హైరిస్క్ కేంద్రాలుగా గుర్తించారు. జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు 87,460 మంది పిల్లలను గుర్తించిన వైద్యశాఖ సిబ్బంది, పొలియో చుక్కలను వేసేందుకు 2,820 మంది సిబ్బంది, 69 మంది సూపర్‌వైజర్లను నియమించారు. పీహెచ్‌సీలు, గ్రామ పంచాయతీలు, బస్‌స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక్కరోజే 84,915 మందికి చుక్కల మందు వేశారు. నేడు, రేపు ఇంటింటికి వెళ్లి మిగిలిన పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేయనున్నట్టు వైద్యశాఖ సిబ్బంది స్పష్టం చేశారు.
ప్రతీ చిన్నారికి చుక్కల మందు వేయించాలి
జిల్లాలో ఐదేళ్ల లోపు ప్రతీ చిన్నారికి పల్స్ పొలియో చుక్కలు వేయించాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజారాధకృష్ణశర్మ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. నేడు, రేపు ఆశా, వైద్య సిబ్బంది ఇంటింటికి సందర్శించి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్ మనోహర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులరాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.