కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు

ABN , First Publish Date - 2022-12-15T00:05:46+05:30 IST

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోల్‌ కార్యాలయంపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు
జహీరాబాద్‌లో గీతారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

సంగారెడ్డి టౌన్‌/జహీరాబాద్‌/పాపన్నపేట/చిన్నశంకరంపేట/నారాయణఖేడ్‌, డిసెంబరు 14: హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోల్‌ కార్యాలయంపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్‌, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి కూన సంతోష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జార్జ్‌, నాయకులు శ్రీను, గంగేరి శ్రీహరి, బుచ్చిరాములు, నర్సింలు, తాహేర్‌అలీ, జహంగీర్‌, రవికుమార్‌, కసిని రాజు, దిగ్డిగౌని రఘు, మహాబలి పాల్గొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అక్రమంగా వార్‌రూమ్‌ లోకి చొరబడి కంప్యూటర్లో ఎత్తుకెళ్లడం సమంజసమా అని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఖండేం నరసింహులు, రాచయ్య పాల్గొన్నారు. పాపన్నపేటలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు గోవింద్‌నాయక్‌, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్‌, శెట్టి శ్రీకాంత్‌, ప్రేమ్‌, నిఠాలక్షప్ప, ఈశ్వరప్ప, కలీం, అంజయ్య పాల్గొన్నారు. చిన్నశంకరంపేటలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పోతరాజు రమణ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణఖేడ్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురే్‌షషెట్కార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ దారం శంకర్‌, కౌన్సిలర్‌ రాజేష్‌ చౌహాన్‌, సురేష్‌, నాయకులు తాహేర్‌ అలీ, సాయిలుపటేల్‌, సద్దాం, హన్మండ్లు, నాయకులు లోకే్‌షరెడ్డి, అశోక్‌రెడ్డి, యాదవరెడ్డి, వినోద్‌పాటిల్‌, ఆవుటిశంకర్‌, గుండెరావు, రాంచందర్‌, పండరిరెడ్డి, రాజు, శ్రీకాంత్‌, శ్రీనివా్‌సరెడ్డి, చందర్‌నాయక్‌, సాయిలు, హన్మంతు, భక్షిరాం, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:05:47+05:30 IST