మల్లన్న దర్శనానికి దివ్యాంగులకు తప్పని ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-11-20T22:22:14+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం ఆదివారం వచ్చిన పలువురు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

మల్లన్న దర్శనానికి దివ్యాంగులకు తప్పని ఇబ్బందులు
ఆలయంలోకి వీల్‌చైర్‌లో దివ్యాంగులను తీసుకెళ్తున్న వలంటీర్లు

చేర్యాల, నవంబరు 20 : కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం ఆదివారం వచ్చిన పలువురు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పడ్డారు. వారిని దర్శనానికి తీసుకువెళ్లేడంలో కుటుంబ సభ్యులకు తిప్పలు తప్పలేవు. వారిని గమనించిన పలువురు వలంటీర్లు వీల్‌చైర్‌లలో తీసుకెళ్లారు. గతంలో ఓ భక్తురాలు రూ.12లక్షల వ్యయంతో లిఫ్ట్‌ ఏర్పాటు చేయించినా సక్రమంగా నిర్వహించకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఈ క్రమంలో మహాముఖమండప విస్తరణ పనులను చేపట్టగా ఉన్న లిఫ్ట్‌ను పూర్తిగా తొలగించారు. నూతన లిఫ్ట్‌ ఏర్పాటుకు పాలకమండలి చర్యలు తీసుకున్నా ఇంకా పనులు పూర్తికాకపోవడంతో ఆ సంగతి మరుగున పడింది. దివ్యాంగ భక్తుల కోసం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం లేదు. వచ్చే నెలలో స్వామివారి కల్యాణంతో పాటు మూడునెలల మహాజాతర ప్రారంభం కానుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో లిఫ్ట్‌ ఏర్పాటుకు ఆలయవర్గాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-20T22:22:14+05:30 IST

Read more