విజేతలకు బహుమతుల అందజేత

ABN , First Publish Date - 2022-12-31T00:21:55+05:30 IST

మండలంలోని గుడికందుల గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట అధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.

విజేతలకు బహుమతుల అందజేత
క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

తొగుట, డిసెంబరు 30: మండలంలోని గుడికందుల గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట అధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఈ కబడ్డీ పోటీలలో 25 జట్లు, వాలీబాల్‌ పోటీలకు 35 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీల్లో మొదటి స్థానం గజ్వేల్‌ ప్రశాంత్‌ టీం, రెండో స్థానం ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌, కబడ్డీలో మొదటి స్థానం శ్రీ గిరిపల్లి, రెండో స్థానం సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సాధించారు. ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు శుక్రవారం రాత్రి హాజరై విజేతలకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు.

Updated Date - 2022-12-31T00:21:55+05:30 IST

Read more