యాసంగి యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేయండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-18T05:03:44+05:30 IST

2022-23 యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు.

యాసంగి యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేయండి : కలెక్టర్‌

సంగారెడ్డిరూరల్‌, అక్టోబరు17: 2022-23 యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయశాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. సంక్షేమ పథకాలు రైతులకు చేరేలా వ్యవసాయశాఖాధికారులు కృషి చేయాలన్నారు. రైతుబీమాకు సంబంధించిన డబ్బు బాధిత కుటుంబీకులకు త్వరితగతిన అందేలా ఆయా క్లైయిమ్స్‌, సెటిల్‌మెంట్లు త్వరగా జరిగేలా చూడాలన్నారు. ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, యాసంగి పంట రుణాలు రైతులకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా పథకాల ప్రగతిని జిల్లా, మండల ఏఈవోల కార్యాలయాలు, రైతువేదికల్లో ప్రదర్శించాలని, రైతులు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ వినియోగం, పంటల నాణ్యతా ప్రమాణాలు, పంటల సాగుపై మెలకువలు అందించాలన్నారు. సమీక్షలో వ్యవసాయశాఖ జేడీ నర్సింహారావు, ఉద్యానవనశాఖ అధికారి సునీత పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:03:44+05:30 IST