పూడ్చిపెట్టిన యువతి మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2022-03-06T04:55:12+05:30 IST

పూడ్చిపెట్టిన యువతి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన శనివారం కోహీర్‌ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది.

పూడ్చిపెట్టిన యువతి మృతదేహానికి పోస్టుమార్టం

జహీరాబాద్‌, మార్చి 5: పూడ్చిపెట్టిన యువతి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన శనివారం కోహీర్‌ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. కోహీర్‌లోని లాలాకుంట కాలనీకి చెందిన విజయలక్ష్మి (25) గత జనవరి  25న తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. అదే బాధలో కుటుంబీకులు సాధారణంగానే అంత్యక్రియలను పూర్తి చేశారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని భావించిన ఆమె తండ్రి బాబయ్య తనకు ఆత్మహత్యపై అనుమానం ఉందని ఇటీవల కోహీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  ఈ మేరకు కోహీర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌  కోహీర్‌ మండల తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌ సమక్షంలో విజయలక్ష్మి మృతదేహాన్ని సమాధిలో నుంచి బయటికి తీయించి ఫోరెన్సిక్‌, క్లూస్‌ టీమ్‌ వారిచే పోస్ట్‌మార్టం చేయించారు.

Read more