పోలీసులు ప్రజల మన్ననలను పొందేలా పనిచేయాలి : సీపీ

ABN , First Publish Date - 2022-10-08T05:25:04+05:30 IST

ప్రజల మన్ననలను పొందేలా పోలీసులు పని చేయాలని సిద్దిపేట సీపీ ఎన్‌.శ్వేత పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన ములుగు పోలీ్‌సస్టేషన్‌ను ఆమె సందర్శించారు. స్టేషన్‌చుట్టూ నాటిన మొక్కలను పరిశీలించారు. వివిధ కేసులలో సీజ్‌ చేసిన, అబ్బాండెడ్‌ వాహనాలను పరిశీలించి త్వరగా డిస్పోజల్‌ చేయాలని ఎస్‌ఐ రంగకృష్ణకు ఆమె సూచించారు.

పోలీసులు ప్రజల మన్ననలను పొందేలా పనిచేయాలి : సీపీ


ములుగు, అక్టోబరు 7 : ప్రజల మన్ననలను పొందేలా పోలీసులు పని చేయాలని సిద్దిపేట సీపీ ఎన్‌.శ్వేత పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన ములుగు పోలీ్‌సస్టేషన్‌ను ఆమె సందర్శించారు. స్టేషన్‌చుట్టూ నాటిన మొక్కలను పరిశీలించారు. వివిధ కేసులలో సీజ్‌ చేసిన, అబ్బాండెడ్‌  వాహనాలను పరిశీలించి త్వరగా డిస్పోజల్‌ చేయాలని ఎస్‌ఐ రంగకృష్ణకు ఆమె సూచించారు. 5ఎస్‌ ఇంప్లిమెంటేషన్‌ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సీపీ సూచించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. నామినల్‌ రోల్స్‌ను పరిశీలించి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అలర్ట్‌ చేసిన డ్యూటీల ప్రకారం ఉండాలని తెలిపారు.  పోలీస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్ల నుంచి నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. అండర్‌ ఇన్వెస్టిగేషన్‌, పెండింగ్‌ ట్రయల్‌, గ్రేవ్‌ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం పోలీస్‌ అధికారులు, సిబ్బందితో ఇంట్రాక్టివ్‌ సేషన్‌ నిర్వహించారు. అంకితభావంతో విధులు నిర్వహించిన వారికి ప్రతీనెలా రివార్డులు, అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫంక్షనల్‌ వర్టికల్‌ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను వారు నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సీపీ శ్వేత సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను తక్షణమే స్పందించాలన్నారు. రౌడీలు, కేడీలు, అనుమానాస్పద విద్రోహశక్తులపై నిరంతరం నిఘా ఉంచి వారి కదలికలను గమనించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్‌ అధికారులు పాత నేరస్థులను తనిఖీ చేయాలని ఆదేశించారు. విధినిర్వహణలో రోల్‌ క్లారిటీ, గోల్‌ క్లారిటీ ప్రతీ ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. వీపీవో పోలీస్‌ఆఫీసర్‌ వారంలో రెండు, మూడు సార్లు సంబంధిత గ్రామాలను సందర్శించి ప్రజలకు ఉన్న సమస్యలపై ఆరా తీయాలని సీపీ ఆదేశించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీసీటీఎన్‌ఎస్‌ (కైరమ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం) ద్వారా ప్రతీ దరఖాస్తును, ఎఫ్‌ఐఆర్‌లను, సీడీఎఫ్‌, పార్ట్‌-1, పార్ట్‌-2  రిమాండ్‌ సీడీ, ఛార్జ్‌షీట్‌ కోర్టు డిస్పోజల్‌ ఆన్‌లైన్‌లో ప్రతీరోజు ఎంటర్‌ చేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్‌ రేటును తగ్గించాలన్నారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ ఉండాలని కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్లను పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచినందుకు ఎస్‌ఐ రంగ కృష్ణ, సిబ్బందిని అభినందించారు. అధికారులు ఆమె వెంట గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, గజ్వేల్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఏఎ్‌సఐలు శంకర్‌, నాగేశ్వరరావు, శివకుమార్‌, ప్రేమ్‌రాజ్‌, ఆండాలు, హెడ్‌కానిస్టేబుళ్లు, సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2022-10-08T05:25:04+05:30 IST