దేహదారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-12-07T00:32:17+05:30 IST

ఈనెల 22 నుంచి జనవరి 3 వరకు జరిగే ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. మంగళవారం దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల గురించి పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దేహదారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
పోలీసుఅధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శ్వేత

బయోమెట్రిక్‌, సీసీ నిఘాలో ఫిజికల్‌ టెస్టులు : సీపీ శ్వేత

సిద్దిపేట క్రైం, డిసెంబరు 6 : ఈనెల 22 నుంచి జనవరి 3 వరకు జరిగే ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. మంగళవారం దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల గురించి పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్కింగ్‌ ప్రదేశాలు, రిసెప్షన్‌ ఈవెంట్‌ నిర్వహించే పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ 1600, 800 ట్రాక్‌ , లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తదితర అంశాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9983 మందికి శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలు, విమర్శలకు తావులేకుండా శారీరక దారుఢ్య పరీక్షలు జరిగే గ్రౌండ్‌ మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్‌ మీటర్లు, పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగుకు, మహిళలకు 800 మీటర్ల పరుగు ఆర్‌.ఎ్‌ఫ.ఐ.డీ ప్యాడ్లను ఉపయోగిస్తారని తెలిపారు. ప్రతీ అభ్యర్థికి రిస్ట్‌బ్యాండ్‌ అమర్చడం జరుగుతుందన్నారు. అభ్యర్థి రిస్ట్‌ బ్యాండ్‌ను చేతి నుంచి తీసేయడం, లేదా డ్యామేజ్‌ చేయడం చేయకూడదన్నారు. అలా చేసినట్లయితే వారు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారులందరి సమక్షంలో త్వరలో ట్రయల్‌రన్‌ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈవెంట్స్‌లో పాల్గొనే అధికారులు సిబ్బంది సమన్వయంతో పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీలు సుభాష్‌చంద్రబోస్‌, రామచంద్రరావు, సీసీఆర్బీ ఏసీపీ చంద్రశేఖర్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రఘుపతిరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌ రెడ్డి, రామకృష్ణ, ధరణి కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డి, త్రీటౌన్‌ సిఐ భాను ప్రకాష్‌, ఏవో యాదమ్మ, సూపరింటిండెంట్లు ఎస్‌.కె జమీల్‌ పాషా, అబ్దుల్‌ ఆజాద్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది, ఐటీ సెల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:32:18+05:30 IST