దేశ ప్రజలు తెలంగాణ పథకాలు కోరుకుంటున్నరు

ABN , First Publish Date - 2022-12-07T23:38:55+05:30 IST

చేర్యాల, డిసెంబరు 7: సీఎం కేసీఆర్‌ తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కానీ బీజేపీ మాత్రం బంద్‌ చేయాలంటుండడం శోచనీయమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

దేశ ప్రజలు తెలంగాణ పథకాలు కోరుకుంటున్నరు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, డిసెంబరు 7: సీఎం కేసీఆర్‌ తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కానీ బీజేపీ మాత్రం బంద్‌ చేయాలంటుండడం శోచనీయమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం రాకముందు ఎలా ఉందో.. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రూ.400 కోట్లతో మల్లన్నసాగర్‌ నుంచి తపా్‌సపల్లి రిజర్వాయర్‌కు నీటినందించేందుకు పనులు సాగుతున్నాయని, తద్వారా తరతరాల వరకు కరువు చోటుచేసుకోదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జనగామ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప పాల్గొన్నారు.

అయ్యప్పస్వామి పడిపూజకు హాజరైన ఎమ్మెల్యే

చేర్యాల పట్టణంలోని మద్దూరు ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి నివాసంలో బుధవారం అయ్యప్పస్వామి మహాపడిపూజ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్పస్వామి దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. గురుస్వామి కృష్ణారెడ్డి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామికి రకరకాల ఫల, పుష్పాభిషేకాలు నిర్వహించి 18 మెట్లపై జ్యోతులు వెలిగించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అయ్యప్పస్వాములు చేసిన శరణుఘోషతో పరిసరాలు మార్మోగాయి.

Updated Date - 2022-12-07T23:38:56+05:30 IST