పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T23:52:48+05:30 IST
గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి
మనోహరాబాద్, డిసెంబరు 16: మండలంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీపీ పురం నవనీతరవి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, రూ.5 కోట్లతో మండల సమీకృత భవన నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనాలను తొలగించి, నూతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలను మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలని సభ్యులు కోరారు. సమావేశంలో ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, సర్పంచులు నాగభూషణం, నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపీటీసీలు లతా, నత్తి లావణ్య పాల్గొన్నారు.