గ్రామాల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-12-15T23:57:48+05:30 IST
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.
హత్నూర, డిసెంబరు 15: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. హత్నూర మండల పరిధిలోని నాగులదేవులపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింలు, జడ్పీటీసీ పొట్లచెర్వు ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, ఎంపీటీసీల పోరం మండలాధ్యక్షుడు రాజేందర్, సర్పంచులు వీరస్వామిగౌడ్, బావికాడి సుధాకర్, ఎంపీటీసీలు మీనంపల్లి కిషన్‌రావు, వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శారదాదేవి, ఎంపీవో సువర్ణ, కోవాలెంట్ పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, యాదగిరి, శశిధర్‌రెడ్డి, నవీన్‌గౌడ్, యువత అధ్యక్షుడు కిషోర్, దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షుడు అజ్జు, మధు తదితరులు పాల్గొన్నారు. సీఎ్‌సఆర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన వైకుంఠ రథాలను గుండ్లమాచునూర్, తుర్కలఖానాపూర్, మాధుర, హత్నూర గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హత్నూర ఎంపీపీ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ముచ్చర్ల గ్రామంలో గల దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. దర్గా వద్ద నీటి వసతి కోసం బోరు వేయించి, నీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వాహకులు శాలువా, పూలమాలతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.