ఆలయాల్లో మానసిక ప్రశాంతత : మాధవానంద సరస్వతి
ABN , First Publish Date - 2022-06-07T05:01:54+05:30 IST
ఆలయాల్లోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు.
గజ్వేల్, జూన్ 6: ఆలయాల్లోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో నిర్మించతలపెట్టిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వేదపండితులతో కలిసి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి మాట్లాడుతూ ఆలయాల్లోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. అనంతరం వంటేరు ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. వారివెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సర్పంచ్ దామరంచ ప్రతా్‌పరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బెండే మధు పాల్గొన్నారు.