కొనసాగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు

ABN , First Publish Date - 2022-12-12T23:58:43+05:30 IST

అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గౌరవెల్లి నుంచి కుందనవానిపల్లి వెళ్లే రోడ్డు మూసివేత పనులు మూడురోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా జోరుగా నడుస్తున్నాయి.

కొనసాగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు
సీఐ పర్యవేక్షణలో జోరుగా నడుస్తున్న ప్రాజెక్టు కట్ట మూసివేత పనులు

అక్కన్నపేట, డిసెంబరు 12: అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గౌరవెల్లి నుంచి కుందనవానిపల్లి వెళ్లే రోడ్డు మూసివేత పనులు మూడురోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా జోరుగా నడుస్తున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు హుస్నాబాద్‌ సీఐ ఎర్రల కిరణ్‌ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు రామవరం వెళ్లే దారి వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో భూ నిర్వాసితులు నిరసన తెలుపుతున్నారు. త్వరగా ప్రాజెక్టు కట్ట మూసివేత పనులను పూర్తిచేసి ప్రాజెక్టులోకి గోదావరి జలాలను విడుదల చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

Updated Date - 2022-12-13T00:00:12+05:30 IST

Read more