నారాయణఖేడ్‌లో బైక్‌ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-09-11T04:39:41+05:30 IST

వాకింగ్‌ కోసం వెళ్లిన ఓ వ్యాపారిని వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నారాయణఖేడ్‌లో బైక్‌ ఢీకొని ఒకరి మృతి

నారాయణఖేడ్‌, సెప్టెంబరు 10: వాకింగ్‌ కోసం వెళ్లిన ఓ వ్యాపారిని వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నారాయణఖేడ్‌ పట్టణ శివారులో జరిగింది. శనివారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేంద్రకర్‌ అశోక్‌రావు(68) శుక్రవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పంచగామ కమాన్‌ వైపు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బైక్‌ (టీఎ్‌స07ఎ్‌ఫకే0868) వెనుక నుంచి అతడిని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్‌రావు తలకు, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  

Read more