ఆటో బోల్తాపడి ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-10-18T04:35:27+05:30 IST
కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి, ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది.
శివ్వంపేట, అక్టోబరు 17: కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి, ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... రత్నాపూర్‌కు చెందిన సత్తయ్య(75) చిన్నగొట్టిముక్లలో ఉండే కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీప్రాంతంలో ఆటోకు కోతులు ఒక్కసారిగా అడ్డురావడంతో వాటిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో కూర్చున్న సత్తయ్య కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.