ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-01-24T03:42:43+05:30 IST

ములుగు మండలం తునికి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో ఈ నెల 19న కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న వంటిమామిడికి చెందిన ఉప్పల రమే్‌షగౌడ్‌ తలకు బలమైన గాయాలయ్యాయి.

ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఒకరి మృతి

ములుగు, జనవరి 23:  ములుగు మండలం తునికి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో ఈ నెల 19న కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న వంటిమామిడికి చెందిన ఉప్పల రమే్‌షగౌడ్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం హైదరాబాద్‌లోని ఓ పైవ్రేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రమే్‌షగౌడ్‌ (55)కు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని తెలిపారు. కాగా శనివారం రాత్రి రమేశ్‌గౌడ్‌ మృతి చెందినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రమేష్‌ గౌడ్‌ కుటుంబసభ్యులు అతడి అవయవాలను జీవన్‌దాన్‌ సంస్థకు దానం చేశారని ఎస్‌ఐ రంగ క్రిష్ణ తెలిపారు. ఉప్పల రమే్‌షగౌడ్‌ మరణంతో వంటిమామిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రమేశ్‌గౌడ్‌కు భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read more