సిద్దిపేట రాత మార్చారు

ABN , First Publish Date - 2022-08-18T04:38:15+05:30 IST

‘సిరి వెలుగులతో సిద్దిపేట రాత మార్చారు.. మంత్రి హరీశ్‌రావు దార్శనికతకు దాసోహం.. అభివృద్ధి దీక్షాదక్షత ఆయనకే సొంతం.. పుట్టిపెరిగిన ఊరి మార్పును చూసి ఉప్పొంగిపోయాను’ అంటూ ఇటీవల నెదర్లాండ్‌ నుంచి సిద్దిపేటకు వచ్చిన ప్రవాసభారతీయుడు నరేందర్‌రెడ్డి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంత్రి హరీశ్‌రావుకు ఉత్తరం ద్వారా తన మనోగతాన్ని వెల్లడించారు. బుధవారం మంత్రికి ఈ లేఖ అందింది.

సిద్దిపేట రాత మార్చారు

మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాసిన ప్రవాస భారతీయుడు

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 17: ‘సిరి వెలుగులతో సిద్దిపేట రాత మార్చారు.. మంత్రి హరీశ్‌రావు దార్శనికతకు దాసోహం.. అభివృద్ధి దీక్షాదక్షత ఆయనకే సొంతం.. పుట్టిపెరిగిన ఊరి మార్పును చూసి ఉప్పొంగిపోయాను’ అంటూ ఇటీవల నెదర్లాండ్‌ నుంచి సిద్దిపేటకు వచ్చిన ప్రవాసభారతీయుడు నరేందర్‌రెడ్డి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంత్రి హరీశ్‌రావుకు ఉత్తరం ద్వారా తన మనోగతాన్ని వెల్లడించారు. బుధవారం మంత్రికి ఈ లేఖ అందింది. సిద్దిపేట పట్టణానికి చెందిన నరేందర్‌రెడ్డి 20 ఏళ్ల క్రితం నెదర్లాండ్‌కి వెళ్లి స్థిరపడ్డాడు. ప్రముఖ ఎన్‌ఆర్‌జీ గ్రూప్స్‌ ఆఫ్‌ కంపెనీలో సీఈవో స్థాయికి ఎదిగి ఇటీవల సిద్దిపేటకు వచ్చారు. ఇక్కడి అభివృద్ధిని చూసిన ఆయన నెదర్లాండ్‌కు తిరిగి వెళ్లిన అనంతరం మంత్రికి లేఖ పంపించారు. తాను పుట్టిపెరిగిన ఊరు అభివృద్ధిపై తన మనోగతాన్ని లేఖ ద్వారా మంత్రికి తెలియపరిచారు. ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారని, అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతమంటూ మంత్రి హరీశ్‌రావును కొనియాడారు. పుట్టిపెరిగిన ఊరిని చూసి తనకు ఆనందభాష్పాలు ఉప్పొంగాయని తెలిపారు. సిద్దిపేట ప్రాంత వాసి కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని, ఇంకో 10 తరాల అభివృద్ధి ఇప్పుడే జరిగిందని ఆ ఉత్తరంలో ఆయన పేర్కొన్నారు. 

Read more