పంద్రాగస్టుకు సమాచారం ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-08-16T05:36:42+05:30 IST

మండలంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు తనకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో జగదీశ్వరచారి అవమానపరిచారని ఉప్పులింగాపూర్‌ కాంగ్రెస్‌ ఎంపీటీసీ సరితారెడ్డి పేర్కొన్నారు.

పంద్రాగస్టుకు సమాచారం ఇవ్వలేదు

వెల్దుర్తి, ఆగస్టు 15: మండలంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు తనకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో జగదీశ్వరచారి అవమానపరిచారని ఉప్పులింగాపూర్‌  కాంగ్రెస్‌ ఎంపీటీసీ సరితారెడ్డి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయం పూర్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంగా మారిందన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

Read more