న్యూఇయర్‌ జోష్‌

ABN , First Publish Date - 2022-12-31T23:01:51+05:30 IST

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2023కు ఘనంగా స్వాగతం పలికారు.

న్యూఇయర్‌ జోష్‌

అంబరాన్నంటిన సంబరాలు

కిక్కిరిసిన బేకరీలు, వైన్‌షాపులు

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 31: మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2023కు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం అర్ధరాత్రి దాటేవరకు న్యూఇయర్‌ వేడుకులు కొనసాగాయి. ఉదయం నుంచే యువతీ, యువకులు వేడుకల కోసం ఏర్పాట్లను చేసుకున్నారు. అర్ధరాత్రి 12 దాటగానే పల్లెలు.. పట్టణాలు.. యువత, మహిళలు.. పిల్లల కేరింతలతో మార్మోగాయి. కేక్‌లు కట్‌ చేసుకొని ఒకరికొకరు పూసుకుంటూ శుభాకాంక్షులు తెలుపుకొంటూ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ర్టాగ్రామ్‌లు ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దాదాపు గంటసేపు వరకు ఫోన్‌లన్నీ బిజీగా మారిపోయాయి.

మార్కెట్లు కిటకిట..

కొత్త సంవత్సరం సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడాయి. వేడుకలకు అనుగుణంగా వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యువతను ఆకర్షించేందుకు వివిధ ఆకారాల్లో భారీ కేక్‌లు తయారు చేశారు. ప్రజలు సాయంత్రం నుంచే కేక్‌లను తీసుకెళ్లారు. రాత్రి 12 గంటల వరకు మద్యంషాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైన్‌షాపుల వద్ద బారులుతీరారు. నాన్‌వెజ్‌ కోసం మద్యం ప్రియులు ఎగబడ్డారు.

Updated Date - 2022-12-31T23:01:52+05:30 IST