దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-12-31T23:05:15+05:30 IST
సిద్దిపేట క్రైం, డిసెంబరు 31: ప్రపంచ గురువుగా భారతదేశం అవతరించబోతుందని, దానికి తరగతి గదులే కారణమని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.
సిద్దిపేట క్రైం, డిసెంబరు 31: ప్రపంచ గురువుగా భారతదేశం అవతరించబోతుందని, దానికి తరగతి గదులే కారణమని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాకలో తపస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. భవిష్యత్ మొత్తానికి భారతదేశం కేంద్రంగా మారుతుందని, నేడు భారతదేశ ప్రతిభ ప్రపంచం మొత్తం వ్యాపించిందని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, విద్యారంగ అధికారులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారమై, విద్యాభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నానని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీధర్, రాష్ట్ర నాయకులు బాధ్యులు తిరుపతి, శ్రీనాకర్‌రెడ్డి, జనార్ధన్, శివ, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.