ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏవో

ABN , First Publish Date - 2022-07-19T05:09:16+05:30 IST

నూతనంగా పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులు ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని మాసాయిపేట, తూప్రాన్‌ మండలాల వ్యవసాయ అధికారులు రాజశేఖర్‌ గౌడ్‌, గంగుమల్లు తెలిపారు.

ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏవో

మాసాయిపేట/తూప్రాన్‌రూరల్‌, జూలై 18: నూతనంగా పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులు ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని మాసాయిపేట, తూప్రాన్‌ మండలాల వ్యవసాయ అధికారులు రాజశేఖర్‌ గౌడ్‌, గంగుమల్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే రైతులు బీమా చేయించుకోవాలన్నారు. ఒక వేళ ఆధార్‌ కార్డులో మార్పులు ఉంటే ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకానికి 18 నుంచి 59యేళ్ల వయస్సున్న వారు అర్హులని ఆయన చెప్పారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం ఆధార్‌కార్డు, బీమా దరఖాస్తు ఫారం, నామిని ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను రైతులే నేరుగా వ్యవసాయ అధికారులకు అందజేయాలని, రైతుకు బదులుగా వేరే వ్యక్తులు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించబోమన్నారు.

Read more