ఎంపీడీవో కార్యాలయ భవనం పరిశీలన
ABN , First Publish Date - 2022-05-15T05:25:48+05:30 IST
చేర్యాలలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకోసం ప్రతిపాదించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా జడ్జి భవాని శనివారం పరిశీలించారు.
చేర్యాల, మే 14: చేర్యాలలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకోసం ప్రతిపాదించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా జడ్జి భవాని శనివారం పరిశీలించారు. కోర్టు కోసం కార్యాలయంలో కొంత భాగాన్ని కేటాయించేందుకు నిర్ణయించిన క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కోర్టు కోసం 9 గదులు అవసరం కాగా, ఎంపీడీవో కార్యాలయ భవనం మొత్తాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవ చూపి ఎంపీడీవో అన్వర్‌తో ఫోన్‌లో మాట్లాడి కార్యాలయాన్ని ఖాళీచేసి కోర్టుకు కేటాయించాలని సూచించడంతో అంగీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ పరిధిలోని ఐకేపీ భవనం, పాత ఆర్‌డబ్ల్యూఎస్ భవనం, భవిత కార్యాలయ భవనాలకు సంబంధించిన స్థలం మ్యాపులను అందించాలని జడ్జి భవాని సూచించారు. అప్పటివరకు ఎంపీడీవో కార్యాలయాన్ని స్థానిక బీసీ హాస్టల్ లేదా భవిత కార్యాలయంలో కొనసాగింపజేసేందుకు చర్యలు తీసుకున్నారు. వారి వెంట మునిసిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి, కౌన్సిలర్ ఆడెపు నరేందర్, ఎంపీడీవో తారీక్ అన్వర్, ఆర్‌ఐ రాజేందర్‌రెడ్డి తదితరులున్నారు.