‘నీడ లేని జీవితం’పై అధికారుల్లో కదలిక

ABN , First Publish Date - 2022-10-18T05:02:59+05:30 IST

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని రామాలయ కల్యాణ మండపంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు

‘నీడ లేని జీవితం’పై అధికారుల్లో కదలిక

 తూప్రాన్‌, అక్టోబరు 17: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని రామాలయ  కల్యాణ మండపంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. సోమవారం  ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘నిలువ నీడ లేని జీవితం!’ అంటూ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో వివరాల సేకరణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు వివరాలను సేకరించాలని తూప్రాన్‌ తహసీల్దారు కార్యాలయ అధికారులను తూప్రాన్‌ ఇన్‌చార్జి, మెదక్‌ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం తూప్రాన్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జయభరత్‌రెడ్డి రామాలయం వద్దకు వెళ్లి అక్కాతమ్ముళ్ల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు. వారికి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వృద్ధుల వద్దకు మంగళవారం మెదక్‌ ఆర్డీవో సాయిరాం రానున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-10-18T05:02:59+05:30 IST