సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శం : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-17T06:08:22+05:30 IST

కేసీఆర్‌ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్‌లో సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శం : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

నర్సాపూర్‌, సెప్టెంబరు 16: కేసీఆర్‌ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్‌లో సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం  గిరిజన గురుకుల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం నిజాం పాలన తర్వాత భారతదేశంలో విలీనం అయిన సందర్భం ఈతరం వారికి తెలియాలనే వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయ అశోక్‌గౌడ్‌,  గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు రాజుయాదవ్‌, వెంకట్రాంరెడ్డి,  ఆత్మకమిటీ చైౖర్మన్‌ గొర్రెవెంకట్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బహిరంగ సభకు వచ్చిన జనాలు, విద్యార్థులు కూర్చొవడానికి టెంటు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు.

Read more