ఈ బట్టేబాజ్‌ను లోపలేయండి!

ABN , First Publish Date - 2022-09-26T05:57:33+05:30 IST

’’ఈ బట్టేబాజ్‌ గాన్ని లోపలేయండి..! కల్యాణలక్ష్మి వస్తలేదంటావ్‌.. మొన్ననే చెక్కులు ఇంచ్చిండ్రు.. ఛల్‌ వీన్ని తీసుకుపోయి లోపలేయండి.. మర్యాద లేదు ఏం లేదు’’ అంటూ ఓ యువకుడిపై మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మండిపడ్డారు.

ఈ బట్టేబాజ్‌ను లోపలేయండి!
యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

కల్యాణలక్ష్మి వస్తలేదంటావురా.. అంటూ యువకుడ్ని బూతులు తిట్టిన నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌/చిలప్‌చెడ్‌, సెప్టెంబరు 25: ’’ఈ బట్టేబాజ్‌ గాన్ని లోపలేయండి..! కల్యాణలక్ష్మి వస్తలేదంటావ్‌.. మొన్ననే చెక్కులు ఇంచ్చిండ్రు.. ఛల్‌ వీన్ని తీసుకుపోయి లోపలేయండి.. మర్యాద లేదు ఏం లేదు’’ అంటూ ఓ యువకుడిపై మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మండిపడ్డారు. విచక్షణను కోల్పోయిన మదన్‌రెడ్డి బూతులు తిట్డాడు. అంతటితో ఆగకుండా వాన్ని లోపలేయండి.. అంటూ అక్కడున్న పోలీసులకు  హుకూం జారీ చేశారు. వివరాలలోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం అజ్జమర్రిలో శనివారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. పేదింటి ఆడపిల్లల పెళ్లికి తమ ప్రభుత్వం రూ.లక్షా116 లు ఇస్తుందన్నారు. మరి మీ ఊరిలో కల్యాణలక్ష్మి వస్తుందా అంటూ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. అక్కడే ఉన్న ఓ యువకుడు వస్తుంది కానీ పైసలు వస్తలేవు సార్‌ అంటూ సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చింది. రెచ్చిపోయిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆ యువకుడి పై ఆగ్రహం వ్యక్త చేశారు. కల్యాణలక్ష్మి ఎందుకొస్తలేదురా.. నువ్వు బట్టేబాజ్‌గాడివి ఉన్నవ్‌.. ఛల్‌ వీన్ని తీసుకుపోయిన లోపలేయండి.. గు...మీద తన్ను’’ అంటూ పోలీసులకు హుకూం జారీ చేశారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ మహ్మద్‌గౌస్‌ వచ్చి ఆ యువకుడిని పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బూతులు తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

Read more