TS News: స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు యత్నాలు.. అడ్డుకున్న జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-08-04T21:09:52+05:30 IST

స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎమ్మేల్యే జగ్గారెడ్డి..

TS News: స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు యత్నాలు.. అడ్డుకున్న జగ్గారెడ్డి

సంగారెడ్డి (Sangareddy): సదాశివపేట స్పిన్నింగ్ మిల్ (Spinning Mill) కార్మికుల (workers) తరలింపునకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 30 ఏళ్లుగా మూతపడిన పరిశ్రమలో కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే మూతపడిన పరిశ్రమ స్థలాన్ని ఇద్దరు పారిశ్రామిక వేత్తలు వేలంలో కొనుగోలు చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న కార్మిక కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. అడ్డుకోబోయిన కార్మికులను పోలీస్స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jagga Reddy) హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని కూల్చివేత ప్రక్రియను అడ్డుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు.

Read more