వంటిమామిడి కూరగాయల మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శం
ABN , First Publish Date - 2022-06-28T05:15:00+05:30 IST
వంటిమామిడి కూరగాయల మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ములుగు మండలం ఒంటిమామిడిలో కూరగాయల మార్కెట్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న వంటిమామిడి మార్కెట్ భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.

భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుంది
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
ములుగు/గజ్వేల్, జూన్ 27: వంటిమామిడి కూరగాయల మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ములుగు మండలం ఒంటిమామిడిలో కూరగాయల మార్కెట్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న వంటిమామిడి మార్కెట్ భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, వైస్‌చైర్మన్ భూపాల్‌రెడ్డి, కార్యదర్శి రేవంత్ తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్‌ను పరిశీలించారు. ఆయనవెంట మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఎలక్షన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ తదితరులున్నారు.