మున్సిపల్‌చైర్‌పర్సన్‌ ను అభినందించిన మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-10-05T04:31:35+05:30 IST

స్వచ్ఛసర్వేక్షణ్‌-2022లో భాగంగా బెస్ట్‌ సిటిజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌ అవార్డును అందుకున్న హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, కమిషనర్‌ రాజమల్లయ్యను మంగళవారం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో సన్మానించారు

మున్సిపల్‌చైర్‌పర్సన్‌ ను అభినందించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ నుంచి అవార్డు అందుకుంటున్న హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత

 హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి రూ. 2 కోట్లు మంజూరు


హుస్నాబాద్‌, అక్టోబరు 4: స్వచ్ఛసర్వేక్షణ్‌-2022లో భాగంగా బెస్ట్‌ సిటిజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌ అవార్డును అందుకున్న హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, కమిషనర్‌ రాజమల్లయ్యను మంగళవారం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో సన్మానించారు. 2 సార్లు అవార్డు అందుకున్న హుస్నాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.2కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పట్టణ ప్రగతి నిధుల ద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా రజిత పేర్కొన్నారు. అవార్డు అందుకున్న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి నగదును అందించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు. 

Read more