Harish rao: కేసీఆర్ ఇచ్చిన మాట తప్పడు

ABN , First Publish Date - 2022-09-01T17:43:45+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని మంత్రి హరీష్ రావు అన్నారు.

Harish rao: కేసీఆర్ ఇచ్చిన మాట తప్పడు

సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇచ్చిన మాట తప్పరని మంత్రి హరీష్ రావు (Harish rao) అన్నారు. గురువారం ఉదయం జిల్లాలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల పోలీస్‌స్టేషన్ ఆర్ గార్డెన్‌లో నూతన ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు మంత్రి (Telangana minister) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు (TRS leader) మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా రూ. 2016ల  పెన్షన్ లేదన్నారు. డబల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో కూడా ఈ పెన్షన్ లేదని అన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. పెన్షన్ కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం (Central minister).. ఉచితాలు బంద్ చేయాలంటున్నారని.. కానీ బడా కంపెనీల వాళ్లకు మాత్రం రూ.12 లక్షల కోట్లు మాఫీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగా ఉంటే దసరాకు ఇళ్ళు కట్టుకునేందుకు డబ్బులిస్తామని ప్రకటించారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు వస్తున్నాయని... 80 వేల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఇప్పటికి 52 వేలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. బీజేపీ (BJP)వి మాటలు తప్ప చేతలు లేవని హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు.

Read more