స్కేటింగ్‌ రింగ్‌ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు హామీ

ABN , First Publish Date - 2022-05-18T05:36:30+05:30 IST

సిద్దిపేటలో స్కేటింగ్‌ క్రీడకు సంబంధించిన రింగ్‌ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు అవసరమైన స్థల సేకరణ చేయాలని స్థానిక నేతలు, అధికారులను ఆదేశించారు. ‘స్కేటింగ్‌కు క్రేజ్‌’ అనే శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని మంత్రి చదివారు.

స్కేటింగ్‌ రింగ్‌ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు హామీసిద్దిపేట క్రైం, మే 17:  సిద్దిపేటలో స్కేటింగ్‌ క్రీడకు సంబంధించిన రింగ్‌ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు అవసరమైన స్థల సేకరణ చేయాలని స్థానిక నేతలు, అధికారులను ఆదేశించారు. ‘స్కేటింగ్‌కు క్రేజ్‌’ అనే శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని మంత్రి చదివారు. ప్రస్తుతం కోమటిచెరువు ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం వద్ద స్కేటింగ్‌ శిక్షణ ఇస్తున్నారని.. ప్రత్యేక రింగ్‌ ఏర్పాటు చేస్తే చిన్నారులకు మేలు జరుగుతుందనే విషయంపై స్పందించారు. సిద్దిపేటలో ఫ్లడ్‌లైట్ల స్టేడియం, స్విమ్మింగ్‌పూల్‌,16 రకాల క్రీడా వసతులు ఉన్నాయని, వీటికి సమీపంలోనే స్కేటింగ్‌ రింగ్‌ కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి నిర్ణయంపై చిన్నారుల తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు. 

Read more