పండుగ అందరికీ విజయాలు చేకూర్చాలి

ABN , First Publish Date - 2022-10-05T04:47:38+05:30 IST

విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆకాంక్షించారు.

పండుగ అందరికీ విజయాలు చేకూర్చాలి
ఆయుధ పూజలో మెదక్‌ ఎస్పీ రోహిణీప్రియదర్శిని

మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 4: విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు  అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆకాంక్షించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శక్తికి  ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో నిర్వహించే ఆయుధపూజ ఎంతో ప్రశస్తమైనదని తెలిపారు. చెడుపై మంచి విజయాలను చేకూర్చే విజయదశమి పండుగ అందరికి సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్‌ శాఖలో ప్రతీ స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ,  పోలీస్‌ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీలు సైదులు, యాదగిరి రెడ్డి, మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌ సీఐలు మధు, చంద్రశేఖర్‌, శ్రీధర్‌తోపాటు డీసీఆర్‌బీఐ రవీందర్‌, ఏఆర్‌ఎ్‌సఐలు నరేష్‌, భవానీకుమార్‌, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read more